2 Kings 4:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడునీవు పోయి ఆ నూనెను అమి్మ నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఏమి జరిగిందో, అప్పుడు ఆ స్త్రీ ఎలీషాతో చెప్పింది. ఎలీషా ఆమెతో అన్నాడు, “వెళ్లు, నూనెను అమ్మి నీ అప్పు తీర్చి వేయి. నీవు నూనెను అమ్మిన తర్వాత, నీ అప్పును తీర్చిన తర్వాత నీవు నీ కుమారులు మిగిలిన పైకంతో జీవించగలుగుతారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు–నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమె వెళ్లి దైవజనునికి చెప్పగా అతడు, “వెళ్లు, ఆ నూనె అమ్మి, నీ అప్పు తీర్చుకో. మిగిలిన దానితో నీవు, నీ కుమారులు జీవనం కొనసాగించండి” అన్నాడు.