2 Kings 6:23 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటినుండి సిరి యనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యానికై చాలా ఆహారం తయారు చేయించాడు. ఆ సైనికులు తిన్నారు, త్రాగారు. తర్వాత ఇశ్రాయేలు రాజు సిరియా సైనికులను వారి దేశానికి పంపించాడు. సిరియా సైనికులు వారి యజమాని వద్దకు వెళ్లారు. సిరియా వారు దాడి చేయడానికై సైనికులెవరినీ ఇశ్రాయేలుకి పంపలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటినుండి సిరియనులదండువారు ఇశ్రాయేలుదేశములోనికి వచ్చుట మానిపోయెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి అతడు వారికి గొప్ప విందు చేసి వారు తిని త్రాగిన తర్వాత వారిని పంపించాడు. వారు తమ యజమాని దగ్గరకు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత అరామీయుల దోపిడి మూకలు ఇశ్రాయేలు సరిహద్దులను ఆక్రమించడం మానుకొన్నాయి.