2 Kings 6:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీ విచారమునకు కారణమేమని యడుగగా అదిఈ స్త్రీ నన్ను చూచినేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తర్వాత, “నీకు వచ్చిన కష్టమేమి?” అని ఇశ్రాయేలు రాజు అడిగాడు. ఆ స్త్రీ ఇలా బదులు చెప్పింది. “నీవు నీ కుమారుని మాకిచ్చివేయండి. అతనిని చంపి నేడు ఆహారం భుజిస్తాము. ఆ తర్వాత మేము మా కుమారుని రేపు భుజిస్తాము” అని ఈమె చెప్పింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ విచారమునకు కారణమేమనియడుగగా అది–ఈ స్త్రీ నన్ను చూచి— నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత రాజు ఆమెను, “నీ సమస్య ఏంటి?” అని అడిగాడు. ఆమె, “ఒకామె నాతో, ‘నీ కుమారుని ఇవ్వు, ఈ రోజు వాన్ని తిందాం, రేపు నా కుమారుని తిందాం’ అని చెప్పింది.