2 Kings 7:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెనుయెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగారేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక టింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుని సందేశం వినండి. యెహోవా చెప్పుచున్నాడు. “రేపు ఈపాటికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అది మరల చౌకగా దొరకుతుంది. సమారియ నగర ద్వారం వద్ద ఒక రూపాయికి ఒక బుట్ట సన్నని మేలు రకం పిండి, ఇంకొక రూపాయికి రెండు బుట్టల (సేరుల) యవలు అమ్మబడును.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను–యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా— రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు ఎలీషా రాజుతో, “యెహోవా మాట విను. యెహోవా చెప్పే మాట ఇదే: రేపు ఇదే వేళకు షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు సమరయ ద్వారం దగ్గర అమ్ముతారు” అని చెప్పాడు.