2 Kings 7:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచిమేము సిరియనుల దండుపేటకు పోతివిు. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుఱ్ఱ ములును కట్టబడిన గాడిదలును ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ తరువాత కుష్ఠరోగులు వచ్చి, నగర ద్వారపాలకులతో చెప్పారు: “మేము సిరియావారి శిబిరాలకు వెళ్లాము. కాని మేము ఎవ్వరి గొంతు వినలేదు. అక్కడ ఎవ్వరూ లేరు. గుర్రాలు గాడిదలు ఇంకా కట్టివేయబడివున్నాయి. గుడారాలు అలాగేవున్నాయి. కాని మనుష్యులందరూ వెళ్లిపోయారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి–మేము సిరియనులదండుపేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైననులేదు. కట్టబడిన గుఱ్ఱములును కట్టబడిన గాడిదలును ఉన్నవిగాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి వారు వెళ్లి పట్టణ ద్వారపాలకులను పిలిచి, “మేము అరామీయుల శిబిరానికి వెళ్లాము. అక్కడ ఎవరూ లేరు, మనిషి చప్పుడు కూడా లేదు, గుర్రాలు, గాడిదలు, గుడారాలు ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి” అని చెప్పారు.