2 Kings 7:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మన విచేసెనుఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహు మంది మనుష్యులు లయమై పోయిరి గదా ఇక అయిదుగురు లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన యెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలొ అయిదు గురిని తీసికొని పోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాజు ఉద్యోగులలో ఒకడు, “నగరంలో ఇంకా మిగిలిన ఐదు గుర్రాలను కొంతమంది పురుషులు తీసుకొని పోనివ్వండి. నగరంలో ఇంకా మిగిలిన ఇశ్రాయేలువారివలె ఆ గుర్రాలు ఎలాగైనా మరణించేవే. ఏమి జరిగిందో తెలుసుకోడానికి ఈవ్యక్తులను మనము పంపిద్దాము” అని చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవిచేసెను–ఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహు మంది మనుష్యులు లయమై పోయిరి గదా ఇక అయిదు గురు లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైనయెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో అయిదు గురిని తీసికొని పోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతని అధికారులలో ఒకడు, “పట్టణంలో మిగిలిన అయిదు గుర్రాలను తీసుకుని కొంతమందిని అక్కడికి వెళ్లనివ్వండి, వారి పరిస్థితి, మిగిలిన ఇశ్రాయేలీయులందరి పరిస్థితి ఒక్కటే, అందరం చనిపోతాము. కాబట్టి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వారిని పంపుదాం” అని అన్నాడు.