2 Kings 7:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఎవని చేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవ జనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పినప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాజు తన సన్నిహితుడయిన ఉద్యోగిని ద్వార సంరక్షణకు ఎంపిక చేసెను. కాని ప్రజలు విరోధి శిబిరము నుండి వస్తువులను పొందడానికి పరుగెత్తి, వారు ఆ ఉద్యోగిని క్రిందికి తోసి అతని మీదుగా నడిచారు. రాజు దేవుని వ్యక్తి అయిన ఎలీషా ఇంటికి వచ్చినప్పుడు, అతను చెప్పినట్లుగానే ఆ ఉద్యోగి మరణించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎవని చేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవ జనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పినప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకున్నాడో, ఆ అధిపతిని ముఖ్య ద్వారపాలకునిగా నియమించాడు, ద్వారం దగ్గర ప్రజలు అతన్ని త్రొక్కగా అతడు చనిపోయాడు. రాజు తన ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు దైవజనుడు చెప్పినట్టే ఇది జరిగింది.