2 Kings 7:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సందెచీకటియందు సిరియనుల దండు పేటలోనికి పోవలె నని లేచి, సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడక పోయిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల ఆ సాయంకాలం ఆ నలుగురు కుష్ఠరోగులు సిరియనుల గుడారానికి వెళ్లారు. వారు గుడారం అంచుదాకా వెళ్లారు. అక్కడ మనుష్యులెవ్వరూ లేరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సందెచీకటియందు సిరియనులదండు పేటలోనికి పోవలెనని లేచి, సిరియనులదండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడక పోయిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సంధ్యా సమయంలో వారు లేచి అరామీయుల శిబిరానికి వెళ్లారు. వారు ఆ శిబిరం పొలిమేరకు వెళ్లగా అక్కడ ఎవరూ లేరు.