2 Kings 8:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచియెహోవా క్షామకాలము రప్పింప బోవు చున్నాడు; ఏడు సంవత్సరములు దేశ ములో క్షామము కలుగునని చెప్పినీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎవరి కొడుకునైతే సజీవునిగా ఎలీషా చేసెనో, ఆ స్త్రీతో ఎలీషా మాటలాడెను. ఎలీషా చెప్పాడు. “నీవు నీ కుటుంబము మరొక దేశానికి వెళ్లాలి. ఎందుకనగా, ఇక్కడ కరువుకాలం ఏర్పడుతుందని యెహోవా నిశ్చయించినాడు. ఈ విధమైన కరువు ఈ దేశంలో ఏడు సంవత్సరముల పాటు ఉంటుంది.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచి–యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు; ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి–నీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బాలుని తల్లితో ఇలా అన్నాడు, “యెహోవా కరువు రప్పిస్తున్నారు, అది ఈ దేశంలో ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి నీవు, నీ కుటుంబం బయలుదేరి మీకు అనువైన చోటికి వెళ్లి కొంతకాలం ఉండండి.”