2 Kings 8:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీనా యేలినవాడవైన రాజా ఆ స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మృతజీవి ఒకనిని సజీవునిగా ఎలీషా చేసెనన్న విషయాన్ని గేహజీ రాజుకి చెప్పుచున్నాడు. ఆ సమయాన తన కొడుకుని ఎలీషా బ్రతికింపజేసిన ఆ స్త్రీ రాజువద్దకు పోయింది. తన పొలమూ, తన యిల్లూ తాను పొందుటకు సహాయం చేయమని రాజుని అడగటానికి ఆమె వెళ్లింది. గేహాజీ, “నా ప్రభువా, రాజా, ఈమెయే ఆ స్త్రీ. ఇతడే ఎలీషా బ్రతికించిన ఆ కుమారుడు” అని చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీ–నా యేలినవాడ వైన రాజా ఆ స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎలీషా ఎలా చచ్చినవాన్ని బ్రతికించాడో గేహజీ రాజుకు చెప్తూ ఉండగానే, అతడు బ్రతికించిన బాలుని తల్లి తన ఇల్లు అలాగే భూమి కోసం రాజుకు మనవి చేసుకోవడానికి వచ్చింది. గేహజీ, “నా ప్రభువా, రాజా, ఈవిడే ఆ స్త్రీ, ఇతడే ఎలీషా బ్రతికించిన ఈ స్త్రీ కుమారుడు” అని అన్నాడు.