2 Kings 9:21 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
రథము సిద్ధము చేయుమని యెహోరాము సెల వియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నా రథం తీసుకుని రా” అని యెహోరాము చెప్పాడు. అందువల్ల సేవకుడు యెహోరాము యొక్క రథమును తీసుకువచ్చాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోరాము, యూదా రాజయిన అహజ్య, ఇద్దరూ రథాలలో యెహూని కలుసుకోడానికి వెళ్లారు. వారు యెజ్రెయేలియుడైన నాబోతు పొలం వద్ద యెహూని కలుసుకున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–రథము సిద్ధముచేయుమని యెహోరాము సెలవియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమతమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోరాము, “నా రథం సిద్ధం చెయ్యండి” అని ఆదేశించాడు. అది సిద్ధం అయినప్పుడు, ఇశ్రాయేలు రాజైన యెహోరాము, యూదా రాజైన అహజ్యా యెహును ఎదుర్కోడానికి తమ రథాలతో బయలుదేరారు. వారు అతన్ని యెజ్రెయేలు పట్టణస్థుడైన నాబోతుకు చెందిన పొలంలో కలుసుకున్నారు.