2 Kings 9:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసినేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారి పొమ్ము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చిన్న నూనె సీసా తీసుకుపోయి, యెహూ తలమీద నూనె పోసి ఈరీతిగా చెప్పు. ఇది యెహోవా చెప్పింది. ఇశ్రాయేలీయుల కొత్తరాజుగా నిన్ను అభిషేకించాను. తర్వాత నీవు తలుపు తెరిచి పారిపో. అక్కడ నిలిచి వుండవద్దు” అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసి–నేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారి పొమ్ము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ఈ నూనె సీసా తీసుకుని నూనె అతని తలమీద పోసి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా అభిషేకించాను’ అని చెప్పి వెంటనే ఆలస్యం చేయకుండ తలుపు తెరిచి పారిపో!”