2 Kings 9:33 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱ ములచేత అతడు దానిని త్రొక్కించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారితో యెహూ, “యెజెబెలుని క్రిందికి త్రోసి వేయండి” అన్నాడు. తర్వాత నపుంసకులు యెజెబెలుని క్రిందికి త్రోసివేశారు. యెజెబెలు రక్తం కొంచెం గోడమీద చిమ్మింది. గుర్రాలమీద కూడా చిమ్మింది. గుర్రాలు యెజెబెలు శరీరం మీదుగా నడిచాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱములచేత అతడు దానిని త్రొక్కించెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు యెహు వారితో, “ఆమెను క్రిందికి త్రోసివేయండి” అని అరిచాడు. వెంటనే వారు ఆమెను త్రోసివేయగా ఆమె నేల మీద పడి, ఆమె రక్తం గోడపైన గుర్రాలపైన చిమ్మింది, యెహు తన రథాన్ని ఆమెపైకి ఎక్కించాడు.