2 Peter 2:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
శి క్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అధికారాన్నుల్లంఘిస్తూ, అసహ్యకరమైన ఐహిక వాంఛల్ని తీర్చుకుంటూ గర్వాంధులై పరలోక నివాసుల్ని దూషించటానికి భయపడనివాళ్ళ విషయంలో యిది ముఖ్యంగా నిజమౌతుంది. ఇలాంటి దుర్బోధకులు ధైర్యంగా గర్వంతో గొప్పవాళ్ళను దూషిస్తారు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ముఖ్యంగా ప్రభుత్వాన్ని తోసిపుచ్చుతూ, అపవిత్రమైన శరీర ఆశలను తీర్చుకుంటూ, తెగువతో, అహంకారంతో, పరలోక సంబంధులను దూషించడానికి భయపడని వారి విషయంలో ఇది నిజం.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరి ముఖ్యంగా శరీరాశలను అనుసరించి చెడిపోయిన వారిని, ఆయన అధికారాన్ని తృణీకరించిన వారిని శిక్షించడం ఆయనకు తెలుసు. వీరు ధైర్యంగా దురహంకారంతో పరలోక సంబంధులను దూషించడానికి భయపడరు.