2 Samuel 11:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు దావీదునీవు యోవాబుతో ఈ మాట చెప్పుముఆ సంగతినిబట్టి నీవు చింతపడకుము; ఖడ్గము ఒకప్పుడు ఒకనిమీదను ఒకప్పుడు మరియొకనిమీదను పడుట కద్దు; పట్టణముమీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి, నీవు యోవాబును ధైర్యపరచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సరే ఈ విషయంపై కలతపడవద్దని యోవాబుతో చెప్పమని దూతతో దావీదు అన్నాడు. “కత్తికి వారూ, వీరూ అనీ తేడా వుండదు. అది అందరినీ చంపుతుంది. రబ్బా నగరంపై దాడి తీవ్రం చేయండి. ఆ నగరం అప్పుడు వశమవుతుంది” అని చెప్పి యోవాబును ప్రోత్సహించమని దావీదు దూతకు చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు దావీదు–నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము–ఆ సంగతినిబట్టి నీవు చింతపడకుము; ఖడ్గము ఒకప్పుడు ఒకనిమీదను ఒకప్పుడు మరియొకనిమీదను పడుట కద్దు; పట్టణముమీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి, నీవు యోవాబును ధైర్యపరచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు ఆ దూతతో, “నీవు యోవాబుతో ఇలా చెప్పు: ‘జరిగినదాన్ని బట్టి నీవు కంగారుపడకు; ఖడ్గం ఒకసారి ఒకరిని మరోసారి ఇంకొకరిని చంపుతుంది. ఆ పట్టణం మీద మీరు ముమ్మరంగా దాడిచేసి దానిని నాశనం చేయండి’ అని చెప్పి యోవాబును ధైర్యపరచు” అన్నాడు.