2 Samuel 14:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకర మగునని అనుకొంటిననెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రభువైన నా రాజు మాటలు మనశ్శాంతినిస్తాయని నాకు తెలుసు. ఎందువల్లనంటే నీవు దేవుని నుండి వచ్చిన దూతలాంటివాడవు. ఏది మంచిదో, ఏది చెడ్డదో నీకు తెలుసు. దేవుడు సదా నీతో వుండు గాక!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిననెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నీ సేవకురాలినైన నేను చెప్పేది ఏంటంటే, ‘మంచి చెడులను విచారించడంలో నా ప్రభువైన రాజు దేవుని దూతవంటివాడు కాబట్టి నా ప్రభువైన రాజు మాట నా వారసత్వాన్ని కాపాడును గాక. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును గాక’ ” అని చెప్పింది.