2 Samuel 14:33 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యోవాబు రాజు వద్దకు వచ్చి అబ్షాలోము అన్న మాటలన్నీ చెప్పాడు. రాజు అబ్షాలోమును పిలిపించగా, అబ్షాలోము వచ్చాడు. అబ్షాలోము రాజు ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారముచేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి యోవాబు రాజు దగ్గరకు వెళ్లి ఆ సంగతి చెప్పాడు. అప్పుడు రాజు అబ్షాలోమును పిలిపించగా అతడు రాజు దగ్గరకు వచ్చి తన తల నేలకు ఆనించి రాజుకు నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.