2 Samuel 15:34 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీవు పట్టణమునకు తిరిగి పోయిరాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని నీవు యెరూషలేము నగరానికి వెళితే, అహీతోపెలు సలహాను ఎందుకూ కొరగానిదిగా నీవు చేయగలవు. అబ్షాలోముతో: ఓ రాజా, నేను నీ సేవకుడను. నేను నీ తండ్రిని సేవించాను. కాని ఇప్పుడు నిన్ను సేవింపవచ్చాను, అని చెప్పు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు పట్టణమునకు తిరిగి పోయి–రాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవు పట్టణానికి తిరిగివెళ్లి అబ్షాలోముతో, ‘రాజా! నేను నీకు సేవకునిగా ఉంటాను. గతంలో మీ తండ్రికి సేవకునిగా ఉన్నాను కాని ఇకపై నీకు సేవకునిగా సేవ చేస్తాను’ అని చెప్పు, అప్పుడు నీవు నా తరుపున అక్కడ ఉండి అహీతోపెలు చేసే సలహాలను చెడగొట్టగలవు.