2 Samuel 16:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అహీతో పెలునీ తండ్రిచేత ఇంటికి కావలి యుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయు లందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అబ్షాలోముతో అహీతోపెలు ఇలా అన్నాడు: “నీ తండ్రి తన యొక్క దాసీలను కొంత మందిని ఇల్లు చూస్తూ ఉండమని వదిలి వెళ్లాడు. నీవు వెళ్లి వారితో సాంగత్యము చేయి. దానితో ఇశ్రాయేలీయులందరూ నీ తండ్రి నిన్నసహ్యించు టున్నాడని వింటారు. అప్పుడు నీకు మద్దతు యివ్వటానికి నీ ప్రజలందరికీ తగిన ప్రోత్సాహం దొరుకుతుంది.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అహీతోపెలు–నీ తండ్రిచేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయినయెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు అహీతోపెలు అబ్షాలోముతో, “రాజభవనానికి కాపలాగా మీ తండ్రి ఉంచిన అతని ఉంపుడుగత్తెలతో పడుకోండి. అప్పుడు మీ తండ్రికి మీరు మరింత అసహ్యులు అయ్యారని ఇశ్రాయేలీయులందరు తెలుసుకుంటారు. మీ పక్షాన ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా శక్తిమంతులవుతారు” అన్నాడు.