2 Samuel 18:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు వాడు¸°వనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండజాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యి తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోవాబుతో అతడిలా అన్నాడు: “నీవు వెయ్యితులముల వెండి ఇచ్చినా నేను రాజకుమారుడిని గాయపర్చేవాడినికాను. ఎందుకనగా, రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి యిచ్చిన ఆజ్ఞ మేమంతా విన్నాము. ‘చిన్నవాడైన అబ్షాలోమును గాయపర్చకుండా ఉదారంగా ప్రవర్తించండి’ అని రాజు అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు వాడు–యౌవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండ జాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యితులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాని అతడు యోవాబుతో, “నా చేతిలో వెయ్యి షెకెళ్ళ వెండి పెట్టినా, రాజు కుమారునిపై నేను చేయి వేయను. యువకుడైన అబ్షాలోముకు ఎవరూ హాని చేయకుండా కాపాడమని మాకందరికి వినిపించేలా రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి ఆజ్ఞ ఇచ్చాడు.