2 Samuel 18:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యోవాబుఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అహిమయస్సుతో యోవాబు ఇలా అన్నాడు: “వద్దు, దావీదుకు ఈ రోజు ఈ వార్తను తీసుకొని పోవటానికి వీలులేదు. ఇంకొక రోజు ఈ వార్తను చేర వేయవచ్చు. అంతేగాని ఈ రోజు మాత్రం వద్దు. ఎందుకంటావా? రాజు యొక్క కుమారుడు చనిపోయాడు గనుక.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యోవాబు–ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు యోవాబు, “ఈ వార్తను ఈ రోజు నీవు మోసుకెళ్లవద్దు ఎందుకంటే తన కుమారుడు చనిపోవడం రాజుకు శుభవార్త కాదు కదా! నీవు మరోసారి నా దూతగా వార్తను మోసుకెళ్దువులే” అని అతనితో చెప్పాడు.