2 Samuel 18:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
తరువాత కూషీని పిలిచినీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియ జేయుమనగా కూషీ యోవాబునకు నమస్కారము చేసి పరుగెత్తికొని పోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తరువాత కూషీయుడైన ఒకనిని యోవాబు పిలిచి, “అతను చూసిన విషయాలన్నీ రాజు వద్దకు వెళ్లి చెప్పమన్నాడు.” కూషీయుడు యోవాబుకు నమస్కరించాడు. తరువాత కూషీయుడు దావీదుకు వార్త చెప్పటానికి పరుగెత్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత కూషీని పిలిచి —నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయుమనగా కూషీ యోవాబునకు నమస్కారము చేసి పరుగెత్తికొని పోయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత యోవాబు కూషీయున్ని పిలిచి, “నీవు వెళ్లి, నీవు చూసిన దానిని రాజుకు చెప్పు” అని చెప్పాడు. ఆ కూషీయుడు యోవాబుకు నమస్కారం చేసి పరిగెత్తుకొని వెళ్లాడు.