2 Samuel 18:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అయితే సాదోకు కుమారుడైన అహి మయస్సుకూషీతోకూడ నేనును పరుగెత్తికొనిపోవు టకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబునాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచార మేదియు లేదు గదా అని అతనితో అనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “ఏమి జరిగినా పరవాలేదు. నన్ను కూడా కూషీయుని వెనుక పరుగెత్తుకు వెళ్లనీయండి!” అని ప్రాధేయపడ్డాడు. “కుమారుడా! నీవెందుకు వార్త మోసుకొని పోవాలనుకుంటున్నావు? నీవు తీసుకొని వెళ్లిన ఈ వార్తకు నీకు ఏ బహుమానమూ లభించదు!” అని యోవాబు అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు–కూషీతోకూడ నేనును పరుగెత్తికొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబు–నాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారమేదియు లేదు గదా అని అతనితో అనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబును, “ఏమైనా కానివ్వండి, నేను కూషీయుని వెంట పరుగెడతాను; నన్ను వెళ్లనివ్వండి” అని మరోసారి వేడుకున్నాడు. కాని యోవాబు, “నా కుమారుడా, నీవెందుకు వెళ్లాలనుకుంటున్నావు? నీకు బహుమతిని తెచ్చే వార్తేమి నీ దగ్గర లేదు” అన్నాడు.