2 Samuel 18:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడుఏమైనను సరే నేను పరుగెత్తికొని పోవుదు ననెను. అందుకు యోవాబుపొమ్మని సెలవియ్యగా అహిమయస్సు మైదానపు మార్గ మున పరుగెత్తికొని కూషీకంటె ముందుగా చేరెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఏమి జరిగినా పరవాలేదు; నేను వేగంగా వెళతాను,” అన్నాడు అహిమయస్సు. “అయితే పరుగెత్తు!” అన్నాడు యోవాబు అహిమ యస్సుతో. అప్పుడు యొర్దాను లోయగుండా అహిమయస్సు పరుగెత్తాడు. అతడు కూషీయుని దాటి వెళ్లాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు–ఏమైనను సరే నేను పరుగెత్తికొని పోవుదుననెను. అందుకు యోవాబు —పొమ్మని సెలవియ్యగా అహిమయస్సు మైదానపు మార్గమున పరుగెత్తికొని కూషీకంటె ముందుగా చేరెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే అతడు, “ఏది ఏమైనా సరే, నేను వెళ్తాను” అన్నాడు. కాబట్టి యోవాబు, “సరే పరుగెత్తు” అన్నాడు. అహిమయస్సు మైదానం మీదుగా పరుగెత్తుకొని వెళ్లి కూషీయుని కంటే ముందుగా చేరుకున్నాడు.