2 Samuel 18:28 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసినా యేలినవాడవును రాజవునగు నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అహిమయస్సు రాజును పిలిచి, “అంతా బాగున్నది!” అన్నాడు. అహిమయస్సు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. “నీ ప్రభువైన దేవునికి స్తోత్రము. నా ఏలినవాడవైన రాజుకు వ్యతిరేకంగా వున్న వారిని యెహోవా ఓడించాడు,” అని అహిమయస్సు చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి–నా యేలినవాడవును రాజవునగు నిన్ను చంప చూచినవారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అహిమయస్సు, “అంతా క్షేమమే” అని అరుస్తూ, రాజు నేలకు తలవంచి నమస్కారం చేసి, “మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం! నా ప్రభువైన రాజుకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఆయన మనకు అప్పగించారు” అన్నాడు.