2 Samuel 18:32 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
రాజుబాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగానా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చినవారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యువకుడైన అబ్షాలోము క్షేమంగా వున్నాడా?” అని రాజు కూషీయుని అడిగాడు. “నీ శత్రువులు, నిన్ను గాయపర్చాలని నీకు వ్యతిరేకంగా వచ్చే ఇతర మనుష్యులు ఆ యువకునిలా (అబ్షాలోము) అయిపోతారని నేను అనుకుంటున్నాను” అని కూషీయుడు చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు–బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగా–నా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చినవారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు కూషీయున్ని, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు కూషీయుడు, “నా ప్రభువైన రాజు యొక్క శత్రువులకు, రాజుకు హాని చేయాలనుకున్న వారందరికి ఆ యువకునికి పట్టిన గతే పట్టాలి” అన్నాడు.