2 Samuel 18:33 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మ మునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచునా కుమారుడా అబ్షా లోమా, నా కుమా రుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దానితో అబ్షాలోము చనిపోయాడని రాజుకు అర్థమయింది. రాజు మిక్కిలి కలతపడిపోయాడు. నగర ద్వారం మీద వున్న గది వద్దకు వెళ్లాడు. అక్కడ బాగా విలపించాడు. గదిలోకి వెళ్లాడు. గదిలోకి పోతూ, “నా కుమారుడా, అబ్షాలోమా! నా కుమారుడా, అబ్షాలోమా! నీ బదులు నేను చనిపోయి వుండవలసింది. ఓ అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా!” అని దుఃఖించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచు–నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు రాజు చాలా కలత చెంది గుమ్మానికి పైన ఉన్న గది లోనికి వెళ్లి, “నా కుమారుడా అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోమా! నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండేది. అబ్షాలోమా! నా కుమారుడా! నా కుమారుడా” అని అంటూ ఏడ్చాడు.