2 Samuel 19:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు పోయి యెవరును తప్పకుండ యూదావారినందరిని రాజునకు ఇష్టపూర్వక ముగా లోబడునట్లు చేయగానీవును నీ సేవకులందరును మరల రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నది యొద్దకు రాగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు యూదా ప్రజలందరి హృదయాలను చూర గొన్నాడు. వారంతా ఒకటయ్యేలా చేశాడు. యూదా ప్రజలు దావీదుకు వర్తమానం పంపారు. “నీ సేవకులందరితో కలిసి తిరిగి రమ్ము” అని వారన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు పోయి యెవరును తప్పకుండ యూదావారినందరిని రాజునకు ఇష్టపూర్వకముగా లోబడునట్లు చేయగా–నీవును నీ సేవకులందరును మరల రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నదియొద్దకు రాగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు వెళ్లి యూదావారందరు ఒక్క మాట మీద ఉండేలా వారందరి హృదయాలను గెలుచుకున్నాడు. అప్పుడు వారు, “మీరు మీ సైన్యం తిరిగి రండి” అని రాజుకు కబురు పంపించారు.