2 Samuel 19:42 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యూదా వారందరురాజు మీకు సమీపబంధువుడై యున్నాడు గదా, మీకు కోపమెందుకు? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలువారితో అనిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యూదా ప్రజలంతా ఇశ్రాయేలీయులకు ఇలా సమాధానం చెప్పారు: “మేము ఆ విధంగా ఎందుకు చేశామంటే రాజు మాకు దగ్గర బంధువు కాబట్టి ఈ విషయంలో మీరు మా పట్ల ఎందుకు కోపంగావున్నారో తెలియటం లేదు. అయినా రాజు చేత ఖర్చు పెట్టించి మేము ఏమి తినలేదు! పైగా రాజు మాకు ఏమీ బహుమానాలు ఇవ్వనూలేదు!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదా వారందరు–రాజు మీకు సమీపబంధువుడై యున్నాడు గదా, మీకు కోప మెందుకు? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలువారితో అనిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు యూదా వారు, “రాజు మీకు చాలా దగ్గరి బంధువు కాబట్టి మేమిలా చేశాము. మీకు కోపమెందుకు? మేము రాజు ఆహారంలో ఏమైనా తిన్నామా? మేము మాకోసం ఏమైనా తీసుకున్నామా?” అని ఇశ్రాయేలువారితో అన్నారు.