2 Samuel 2:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని1 ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రతి ఒక్కడూ తన ప్రత్యర్థి తలను పట్టుకొని తమ కత్తులతో వారి డొక్కలలో పోడుచుకున్నారు. దానితో వారంతా ఒక్క పెట్టున నేలకొరిగారు. అందువల్ల ఆ ప్రదేశం “చురకత్తుల క్షేత్రం” అని పిలవబడింది. ఆ ప్రదేశం గిబియోనులో ఉంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రతి ఒక్కరూ తమ ప్రత్యర్థి తల పట్టుకుని వాని ప్రక్కలో కత్తితో పొడవగా అందరు ఒకేసారి చనిపోయారు. అందుకే ఆ స్థలానికి హెల్కత్ హన్సూరీము అని పేరు వచ్చింది. అది గిబియోనులో ఉంది.