2 Samuel 20:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యోవాబు బంటులలో ఒకడు అతనిదగ్గర నిలిచియోవాబును ఇష్టులైన దావీదు పక్ష ముననున్న వారందరు యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోవాబు సైనికులలో యువకుడైన వాడొకడు అమాశా శవం వద్ద నిలబడ్డాడు. ఆ యువకుడు మిగిలిన వారి నుద్దేశించి, “మీలో యోవాబును, దావీదును బలపర్చే ప్రతి ఒక్కడూ యోవాబును అనుసరించి వెళ్లాలి. షెబను వెంటాడటంలో అతనికి సహాయం చేయండి!” అని అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యోవాబు బంటులలో ఒకడు అతనిదగ్గర నిలిచి–యోవాబుకు ఇష్టులైన దావీదు పక్షముననున్నవారందరు యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యోవాబు మనుష్యుల్లో ఒకడు అమాశా మృతదేహం దగ్గర నిలబడి, “యోవాబును ఇష్టపడేవారు, దావీదు వైపు ఉన్నవారందరు యోవాబును వెంబడించండి” అన్నాడు.