2 Samuel 20:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అమాశా రక్తములో పొర్లుచు మార్గమునపడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరు నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి అమాశాను మార్గమునుండి చేనిలోనికి లాగి, మార్గస్థులందరు నిలిచి తేరిచూడకుండ శవముమీద బట్ట కప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మార్గం మధ్యలో అమాశ శవం రక్తపు మడుగులో పడివుంది. జనమంతా శవాన్ని చూసే నిమిత్తం అక్కడ ఆగుతూ ఉన్నారు కావున ఆ యువకుడు అమాశా శవాన్ని ప్రక్కనే వున్న పొలంలోనికి లాగి, దాని మీద ఒక బట్ట కప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అమాశా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరు నిలిచి యుండుట ఆ మనుష్యుడు చూచి–అమాశాను మార్గము నుండి చేనిలోనికి లాగి, మార్గస్థులందరు నిలిచి తేరిచూడకుండ శవముమీద బట్ట కప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అమాశా మార్గం మధ్యలో రక్తంతో కొట్టుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన సైనికులందరూ అక్కడే ఆగిపోవడం ఆ వ్యక్తి చూసి, అమాశా శవాన్ని దారిలో నుండి పొలంలోకి లాక్కెళ్లి ఆ దారిన వచ్చినవారు నిలబడి చూడకుండ ఆ శవం మీద బట్ట కప్పాడు.