2 Samuel 20:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికి తెలియ జేయగా, వారు బిక్రి కుమారుడగు షెబయొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి యెవరి గుడారములకు వారు పోయిరి; యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తరువాత ఆ స్త్రీ నగర ప్రజలందరితో చాలా యుక్తిగా మాట్లాడింది. అది విని ఆ నగరవాసులు బిక్రి కుమారుడు షెబ తల నరికి దానిని గోడ మీదుగా యోవాబుకు విసరివేశారు. అప్పుడు యోవాబు బూర వూదగా సైన్యం నగరం వదిలి వెళ్లిపోయింది. ప్రతివాడూ తన గుడారానికి వెళ్లిపోయాడు. యెరూషలేములో వున్న రాజు వద్దకు యోవాబు వెళ్లాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికి తెలియ జేయగా, వారు బిక్రి కుమారుడగు షెబయొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి యెవరి గుడారములకు వారు పోయిరి; యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమె వెళ్లి, తాను తెలివిగా యోవాబుతో మాట్లాడిన మాటలు పట్టణ ప్రజలకు చెప్పినప్పుడు వారు బిక్రి కుమారుడైన షేబ తల నరికి యోవాబు దగ్గర పడవేశారు. వెంటనే అతడు బూరధ్వని చేశాడు. అతని మనుష్యులందరు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరకు తిరిగి వెళ్లాడు.