2 Samuel 20:6 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దావీదు అబీషైని పిలువనంపిబిక్రి కుమారుడైన షెబ అబ్షాలోముకంటె మనకు ఎక్కువ కీడుచేయును; వాడు ప్రాకారములుగల పట్టణములలో చొచ్చి మనకు దొరకక పోవునేమో గనుక నీవు నీ యేలినవాని సేవకులను వెంట బెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు అబీషైని పిలిచి, “బిక్రి కుమారుడైన షెబ మనకు అబ్షాలోముకంటె ఎక్కువ ప్రమాద కరమైన మనిషి. కావున నా సైనికులను తీసుకొని షెబను వెంటాడు. షెబ ప్రాకారాలున్న నగరాలలోనికి తప్పించుకునే ముందుగానే నీవు త్వరపడాలి. షెబ గనుక ప్రాకారాలున్న నగరాలలోకి వెళ్లినాడంటే ఇక వాడు మననుండి తప్పించుకున్నట్లే,” అని అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు అబీషైని పిలువనంపి–బిక్రి కుమారుడైన షెబ అబ్షాలోముకంటె మనకు ఎక్కువ కీడుచేయును; వాడు ప్రాకారములుగల పట్టణములలో చొచ్చి మనకు దొరకక పోవునేమో గనుక నీవు నీ యేలినవాని సేవకులను వెంట బెట్టుకొనిపోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు అబీషైని పిలిచి, “అబ్షాలోము కంటే ఈ బిక్రి కుమారుడైన షేబ మనకు ఎక్కువ కీడు చేస్తాడు. నీవు నీ రాజు సేవకులను తీసుకెళ్లి అతన్ని వెంటాడి పట్టుకో లేకపోతే కోటగోడలున్న పట్టణాల్లో దాక్కుని మన నుండి తప్పించుకుంటాడు” అని చెప్పాడు.