2 Samuel 21:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువ కుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెల విచ్చెనుసౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనిని బట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవించింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొనసాగింది. దావీదు యెహోవాను ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా ఇలా అన్నాడు: “సౌలు, మరియు అతని హంతకుల కుటుంబం ఈ కరువుకు కారణం. ఇప్పడీ కాటకం (కష్టం) సౌలు గిబియోనీయులను చంపివేసినందుకు వచ్చింది.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను–సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనినిబట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు పాలనలో మూడు సంవత్సరాలు వరుసగా కరువు రాగా దావీదు యెహోవాకు మనవి చేశాడు. అందుకు యెహోవా, “సౌలు గిబియోనీయులను చంపాడు; అతడు, అతని కుటుంబం రక్తం చిందించిన కారణంగా ఈ కరువు వచ్చింది” అన్నారు.