2 Samuel 21:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గిబియోనీయులు ఇశ్రా యేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారియందు ఆసక్తిగలవాడై వారిని హతము చేయ చూచుచుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
(గిబియోనీయులు ఇశ్రాయేలు వారు కాదు. చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపువారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని గిబియోనీయులకు ప్రమాణ పూర్వకంగా చెప్పియున్నారు. కాని సౌలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా వారి పట్ల ప్రేమకలవాడై గిబియోనీయులను చంపబూనాడు) దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. అతడు వారితో మాట్లాడాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరిగాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారియందు ఆసక్తిగలవాడై వారిని హతము చేయ చూచుచుండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు గిబియోనీయులను పిలిపించి వారితో మాట్లాడాడు. (ఈ గిబియోనీయులు ఇశ్రాయేలీయులకు సంబంధించినవారు కారు; వారు అమోరీయుల జాతిలో మిగిలినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మల్ని చంపమని వారికి ప్రమాణం చేశారు కాని సౌలుకు ఇశ్రాయేలు, యూదా వారి పట్ల ఉన్న ఆసక్తితో వారిని చంపుతూ వచ్చాడు.)