2 Samuel 21:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గిబియోనీయులుసౌలు అతని యింటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనను చంపుటయే గాని మేము కోరుట లేదనిరి. అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“సౌలు, అతని కుటుంబం వారు చేసిన పాపాలకు పరిహారంగా వెండి బంగారాలు ఇవ్వాలని అడిగే హక్కుగాని, ఇశ్రాయేలులో ఎవ్వరినైనా చంపేహక్కుగాని మాకు లేదు” అని గిబియోనీయులు దావీదుతో అన్నారు. “అయితే మీకు నేనేమి చేయగలను?” అని దావీదు అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గిబియోనీయులు–సౌలు అతని యింటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులేగాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనను చంపుటయేగాని మేము కోరుట లేదనిరి. అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదు ననగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు గిబియోనీయులు, “సౌలు అతని కుటుంబం నుండి వెండి బంగారాలను గాని ఇశ్రాయేలులో ఎవరినైనా చంపమని గాని అడగడం లేదు” అని అన్నారు. దావీదు, “నేనేం చేయాలో చెప్పండి అది మీకు చేస్తాను” అన్నాడు.