2 Samuel 21:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారు ఈ యేడు గురిని తీసికొనిపోయి కొండమీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ యేడుగురు ఏకరీతినే చంపబడిరి; కోతకాలమున యవలకోత యారంభమందు వారు మరణమైరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు ఈ ఏడుగురు కుమారులను గిబియోనీయులకు అప్పగించాడు. అప్పుడు గిబియోనీయులు ఈ ఏడుగురిని గిబియా పర్వతంమీద యెహోవా సాన్నిధ్యంలో ఉరితీశారు. ఈ ఏడుగురు కుమారులు కలిసి చనిపోయారు. యవల ధాన్యంపంట కోత ప్రారంభకాలంలో వారు చంపబడ్డారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు ఈ యేడుగురిని తీసికొనిపోయి కొండమీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ యేడుగురు ఏకరీతినే చంపబడిరి; కోతకాలమున యవలకోత యారంభమందువారు మరణమైరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారిని గిబియోనీయులకు అప్పగించాడు. వారు ఈ ఏడుగురిని యెహోవా ఎదుట కొండమీద ఉరితీసి చంపారు. ఆ ఏడుగురు ఒకేసారి చనిపోయారు. కోతకాలం మొదటి రోజున యవల కోత మొదలు పెడుతున్నప్పుడు వారిని చంపారు.