2 Samuel 22:39 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నేను వారిని మింగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను నా శత్రువులను నాశనం చేశాను, నేను వారిని పూర్తిగా సంహరించాను! వారు మరల తలయెత్తే అవకాశం లేదు! అవును, నేను నా శత్రువులను నా కాలరాశాను!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను వారిని మ్రింగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రిందపడి లేవలేకయుందురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు మళ్ళీ లేవకుండా వారిని పూర్తిగా నలుగగొట్టాను; వారు నా పాదాల క్రింద పడ్డారు.