2 Samuel 23:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపర్చలేదు. తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడంబడిక చేశాడు. అది సమగ్రమైన నిబంధనగా దేవుడు రూపొందించాడు. ఈ ఒడంబడికను దేవుడు బలపర్చాడు. దానిని ఆయన ఉల్లంఘించడు! ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం; నేను కోరినదల్లా ఈ ఒడంబడికనే; ఖచ్చితంగా యెహోవా దానిని వర్ధిల్లేలాగు చేస్తాడు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా సంతతివారు దేవునిదృష్టికి అనుకూలురే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఒకవేళ నా కుటుంబం దేవునితో సరిగా లేకపోయినా, నిజంగా ఆయన నాతో శాశ్వతమైన నిబంధన చేసి ఉండరు కదా, ఆ నిబంధన అన్నివిధాల పరిపూర్ణమైనది స్థిరమైనది; నిజంగా ఆయన నా రక్షణను ఫలవంతం చేసి ఉండరు, నా ప్రతి కోరికను ఇచ్చి ఉండరు.