2 Samuel 24:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెనుచిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గ ముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలను నశింపజేసిన దేవదూతను దావీదు చూశాడు. దావీదు యెహోవాకి యిలా విన్నవించుకున్నాడు, “నేను పాపం చేశాను! నేను తప్పు చేశాను! కాని నా ప్రజలంతా నన్ను గొర్రెలవలె అనుసరించారు! వారు చేసిన తప్పేమీ లేదు! కావున దయచేసి నీ కోపం నామీద, నా తండ్రి కుటుంబం మీద మాత్రమే చూపించు!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థిం చెను–చిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱెలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నాశనం చేస్తున్న దూతను చూసిన దావీదు, “గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? ఈ ప్రజలు ఏమి చేశారు? మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి” అని యెహోవాకు ప్రార్థన చేశాడు.