2 Samuel 3:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపిఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సౌలు కుమారుడు ఇష్బోషెతు వద్దకు దావీదు దూతలను పంపాడు. “నా భార్య మీకాలును తిరిగి నాకు తెచ్చి ఇవ్వు. ఆమె నాకు ప్రధానం చేయబడింది. ఆమెను వివాహమాడటానికి నేను వందమంది ఫిలిష్తియులను చంపియున్నాను” అని చెప్పి పంపాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి–ఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ తర్వాత దావీదు సౌలు కుమారుడైన ఇష్-బోషెతు దగ్గరకు దూతలను పంపించి, “వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తెచ్చి వెల చెల్లించి నేను పెండ్లి చేసుకున్న నా భార్య మీకాలును నాకు అప్పగించు” అని కబురు చేశాడు.