2 Samuel 3:35 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసిసూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ రోజు ఇంకా పొద్దువుండగానే దావీదును ఆహారం తీసుకోమని కోరటానికి ప్రజలు వచ్చారు. కాని దావీదు ఒక ప్రత్యేకమైన ప్రమాణం చేశాడు. “నేను రొట్టెగాని, తదితరమైన ఆహారంగాని సూర్యాస్తమయం గాకుండా తింటే దేవుడు నన్ను శిక్షించుగాక! నాకు మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టుగాక!” అని అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసి–సూర్యుడు అస్తమించకమునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక నెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇంకా వెలుగుగా ఉన్నప్పుడే ప్రజలందరూ దావీదు దగ్గరకు వచ్చి భోజనం చేయమని బ్రతిమిలాడారు కాని దావీదు ఒట్టు పెట్టుకుని, “సూర్యాస్తమయానికి ముందు నేను ఏమైనా ఆహారం తింటే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించును గాక” అన్నాడు.