2 Samuel 5:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కంబళిచెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతముచేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెల విచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చెట్ల మీదకు ఎక్కి కూర్చుని, ఫిలిష్తీయులు యుద్ధానికి నడిచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫిలిష్తీయులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్లు అది సంకేతం.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు యెహోవా–నీవు వెళ్లవద్దు–చుట్టు తిరిగిపోయి, కంబళిచెట్లకు ఎదురుగావారిమీద పడుము. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతముచేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే వేగంగా కదులు ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి యెహోవా నీకు ముందుగా వెళ్లారని దాని అర్థం” అని అతనికి జవాబిచ్చారు.