2 Samuel 5:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూ షలేమునకు వచ్చిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి దండెత్తి యెరూషలేముకు పోయెను. (యెబూసీయులుదేశంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు). యెబూసీయులు దావీదుతో, “నీవు మా నగరంలోకి రాలేవు. ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు సహితం నిన్ను విరోధిస్తారు” అని అన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[6-7] యెబూసీయులు దేశములో నివా సులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి–నీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డి వారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి; అయినను దావీదు పురమన బడిన సీయోను కోటను దావీదు స్వాధీన పరచుకొనెను. ఆ దినమున అతడు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెబూసీయుల మీద దాడి చేయడానికి రాజు, అతని మనుష్యులు యెరూషలేముకు వెళ్లారు. దావీదు లోపలికి రాలేడని భావించిన యెబూసీయులు దావీదుతో, “నీవు లోపలికి రాలేవు; ఇక్కడున్న గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తరిమివేస్తారు” అన్నారు.