2 Samuel 6:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళము లను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు, మరియు ఇశ్రాయేలీయులందరూ యెహోవా ముందు రకరకాల వాద్య విశేషాలు వాయిస్తూ ఉన్నారు. ఈ వాద్య పరికరాలు తమాల వృక్షపు కర్రతో చేయబడ్డాయి. ఆ వాద్య విశేషములలో వీణలు, విచిత్ర వీణలు, మృదంగములు, ఢమరుకములు, తాళములు మొదలగునవి ఉన్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, దేవదారు కర్రతో చేసిన చిరతలు, సితారలు, వీణలు, తంబురలు, డప్పులు, తాళాలు వాయిస్తూ తమ శక్తి అంతటితో యెహోవా ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.