2 Samuel 9:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజుసీబావు నీవేగదా అని అడుగగా అతడునీ దాసుడనైన నేనే సీబాను అనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సౌలు కుటుంబానికి చెందిన సీబా అనే ఒక సేవకుడు ఉన్నాడు. దావీదు మనుష్యులు సీబాను దావీదు వద్దకు తీసుకొని వచ్చారు. దావీదు రాజు సీబాతో, “నీవు సీబావేనా?” అని అడిగాడు. “అవును, నీ సేవకుడనైన సీబానే” అని అన్నాడు సీబా.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు–సీబావు నీవేగదా అని అడుగగా అతడు–నీ దాసుడనైన నేనే సీబాను అనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సౌలు కుటుంబానికి సీబా అనే సేవకుడు ఉండేవాడు. వారు అతన్ని పిలిపించి దావీదు ఎదుట నిలబెట్టినప్పుడు రాజు అతన్ని, “నీవు సీబావా?” అని అడిగాడు. అందుకు వాడు, “అవును, రాజా” అన్నాడు.