2 Timothy 1:16 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా చేతికి సంకెళ్ళు ఉన్నాయని సంకోచించక “ఒనేసిఫోరు” ఎన్నోసార్లు వచ్చాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడు గాక!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[16-17] ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రభువు ఒనేసిఫోరు కుటుంబంపై కనికరం చూపు గాక.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రభువు కోసం నాకు పడ్డ సంకెళ్ళను గురించి సిగ్గుపడకుండా, అనేకసార్లు నన్ను ఆదరించిన ఒనేసిఫోరు ఇంటివారిపై ప్రభువు కనికరం చూపించును గాక.