2 Timothy 1:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచారప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞు డనై యున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీలాంటివాణ్ణి నాకు యిచ్చినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. నీ కన్నీళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూసాక నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుని, నిన్ను చూసి నా ఆనందాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీ కన్నీరు జ్ఞాపకం చేసుకుని, నేను ఆనందంతో నింపబడేలా నిన్ను చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాను.