Amos 1:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా సెలవిచ్చునదేమనగాఎదోము మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఎదోము ప్రజలు చేసిన అనేక నేరాలకు వారిని నేను నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే ఎదోము కత్తి పట్టి, తన సోదరుని (ఇశ్రాయేలును) వెంటాడాడు. ఎదోము దయ చూపలేదు. ఎదోము కోపం శాశ్వతంగా కొనసాగింది. అతడు ఒక క్రూర జంతువులా ఇశ్రాయేలును చీల్చి చెండాడాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా సెలవిచ్చునదేమనగా–ఎదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా చెప్పే మాట ఇదే: “ఎదోము చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సోదరున్ని ఖడ్గంతో వెంటాడాడు, ఆ దేశ స్త్రీలను చంపేశాడు, అతని కోపం అధికమవుతూ ఉంది, ఎప్పుడూ రగులుతూ ఉంది.